ఈ నెల 12న కర్నూలులో పవన్ కల్యాణ్ ర్యాలీ.. బహిరంగ సభ
- ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలులో పవన్ పర్యటన
- సుగాలి ప్రీతి ఘటనలో నిందితులను శిక్షించాలని ర్యాలీ
- 13న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటన
ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారని, ఈ ర్యాలీలో జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పాల్గొంటాయని తెలిపారు. అనంతరం, కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పేర్కొంది. 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారని అన్నారు.