జనసేన కార్యకర్తల సమావేశంలో పాత పవర్‌స్టార్‌లా పవన్ లుక్!
- ‘పింక్’ షూటింగులో పాల్గొంటున్న పవర్‌స్టార్
- గడ్డం లేకుండా పవన్ ను చూసి ముచ్చటపడుతున్న అభిమానులు
- మీసం, ఒత్తైన జుట్టుతో కనిపించిన జనసేనాని
రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత గుబురు గెడ్డం, ఒత్తైన జుట్టు, మీసాలతో కనిపించిన పవన్ ఇప్పుడు సరికొత్త లుక్‌లో కనిపించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పవన్ మునుపటి పవర్‌స్టార్‌ను తలపించారు. నున్నటి షేవ్‌లో గుబురు మీసం, ఒత్తైన జుట్టుతో హాజరయ్యారు. రెండేళ్ల తర్వాత పవన్‌ను ఇలా చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ‘పింక్’ షూటింగులో పాల్గొంటున్న పవన్.. అందులో భాగంగానే గుబురు గడ్డాన్ని తొలగించారు. ఈ సినిమాలో పవన్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు.