కియా తరలింపుపై వస్తున్నవన్నీ గాలి వార్తలే: గోరంట్ల మాధవ్
- కియో ఏపీ నుంచి వెళ్లిపోతోందంటూ మీడియా కథనాలు
- టీడీపీ, వైసీపీ నేతల మధ్య రగిలిన చిచ్చు
- ప్రభుత్వంపై మండిపడుతున్న టీడీపీ నేతలు
దీనిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లడంలేదని స్పష్టం చేశారు. కియా మోటార్స్ గురించి వస్తున్న వార్తలన్నీ గాలివార్తలేనని పేర్కొన్నారు. కియా అభివృద్ధికి తగిన చేయూతనిచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కియా మోటార్స్ అంశంపై సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కియాకు ఎంతో విలువైన భూములు ఇచ్చామని, ఒక్క టీఎంసీ నీటితో 15 వేల ఎకరాలకు తడి అందించవచ్చని,అలాంటి విలువైన నీటిని అందించామని తెలిపారు. పరిశ్రమ వస్తే సీమ కరవు పోతుందని, నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించామని గోరంట్ల వివరించారు.