'అశ్వద్ధామ' 3 రోజుల వసూళ్లు
- యాక్షన్ హీరోగా మెప్పించిన నాగశౌర్య
- ప్రపంచ వ్యాప్తంగా 10.35 కోట్ల గ్రాస్
- ప్రమోషన్స్ లో బిజీగా నాగశౌర్య
ఈ వీకెండ్ వరకూ మరో సినిమా లేకపోవడం 'అశ్వద్ధామ'కి కలిసొచ్చే అంశం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, కర్నూల్ .. కడప .. అనంతపురం .. తిరుపతిలో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్స్ కి నాగశౌర్య వెళ్లి పలకరించనున్నాడు. యాక్షన్ హీరోగానూ నాగశౌర్య మెప్పించినా, ఆయన సరైన కథాకథనాలను సిద్ధం చేసుకోలేకపోయాడనే కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. లేకపోతే ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.