అమరావతిని కొనసాగించాలి: అమెరికాలోని ఆంధ్రుల వినతి

  • ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌తో భేటీ
  • రాజధాని అక్కడే ఉంచాలంటూ వినతిపత్రం
  • ఇప్పటికే పలు ప్రాంతాల్లో ర్యాలీలు
అమరావతి రాజధానిగా అత్యంత అనుకూలమైన ప్రాంతమని, అందువల్ల అక్కడే రాజధానిని కొనసాగించాలంటూ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పలు దేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ దేశంలో మన దేశ అత్యున్నత అధికారిని కూడా కలిసి తమ మనసులో మాట తెలియజేశారు. రాజధానిగా అమరావతికి ఉన్న అనుకూలతలు వివరించి దాన్నే కొనసాగించాలని కోరారు.
Go Back to Shorts
Amaravati
NRI's
america
indian consulate
request

More Telugu News