దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి వెల్లంపల్లి
- దేవదాయ భూములను కాపాడుతున్నాం
- భీమిలి దేవదాయ భూముల లీజు వ్యవహరంలో అక్రమాలు జరగలేదు
- భూముల లీజు వేలం రద్దు చేస్తూ జనవరి 28నే పత్రికల్లో ప్రకటన చేశాం
కోట్ల విలువైన భూమిని అక్రమంగా కట్టుబెడుతున్నారనే ఆరోపణ అబద్ధమని వెల్లంపల్లి తెలిపారు. భూముల లీజు వేలం రద్దు చేస్తూ జనవరి 28నే పత్రికల్లో ప్రకటన చేశామని, నిబంధనల ప్రకారమే దేవదాయ భూములకు వేలం వేశామని చెప్పారు. దేవదాయ భూమి గజం అమ్మాలన్నా హైకోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపారు. దేవదాయ భూములపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.