మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- అక్రమాలు చేస్తూ ఆదర్శాలు చెప్పడం వారికే చెల్లింది
- కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు
- ప్రలోభాలు, అవినీతితో జరిగిన ఎన్నికలు కూడా ఓ ఎన్నికలేనా?
వార్డుల రూపకల్పన, రిజర్వేషన్లు తదితర అంశాల్లో టీఆర్ఎస్ అక్రమాలు చేసిందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీతో తెలంగాణలో ఎలా ఓటు వేయిస్తారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు ఇలా ఉంటాయా? అని ప్రశ్నించారు. ప్రలోభాలు, అవినీతితో జరిగిన ఎన్నికలు కూడా ఓ ఎన్నికలేనా? అదీ ఓ గెలుపేనా? అని ఎద్దేవా చేశారు.