కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి మేం రెడీ: నేపాల్ సంచలన ప్రకటన
- కశ్మీర్ వివాదం తమ ద్వైపాక్షిక అంశమని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్
- అమెరికా విజ్ఞప్తినీ తోసిపుచ్చిన వైనం
- నేపాల్ ప్రకటనకు ప్రాధాన్యం
కశ్మీర్ వివాదం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వానికి అమెరికా ముందుకొచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నేపాల్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేపాల్ ప్రకటన వాస్తవమే అయితే, కశ్మీర్ అంశంపై మధ్య వర్తిత్వానికి ఆసక్తి చూపిన తొలి దక్షిణాసియా దేశంగా నేపాల్‌కు గుర్తింపు లభిస్తుంది.