ఈపీఎఫ్ పెన్షన్ దారులకు తీపి కబురు.. రూ. 6 వేలకు పెరగనున్న పెన్షన్?

  • ప్రస్తుతం వెయ్యిరూపాయలుగా ఉన్న పింఛన్
  • ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను నెరవేర్చబోతున్న నిర్మల
  • మళ్లీ అమల్లోకి కమ్యుటేషన్ పద్ధతి
ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది శుభవార్తే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఈపీఎఫ్ కనీస పెన్షన్ ఇకపై రూ.6 వేలకు పెరగనుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పొందుపరిచినట్టు తెలుస్తోంది. నిజానికి ఈపీఎఫ్ పింఛన్‌ను పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరే రోజు అతి దగ్గరలోనే ఉంది.  

దీంతోపాటు గతంలో అమల్లో ఉన్న కమ్యుటేషన్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఇది అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్‌తోపాటు పెన్షన్‌లోని కొంత మొత్తాన్ని కూడా అమ్ముకుని పెద్ద మొత్తంలో తీసుకునే వీలు చిక్కుతుంది. అయితే, అలా తీసుకున్న పక్షంలో నెలవారీ పెన్షన్‌ 15 ఏళ్లపాటు మూడోవంతుకు తగ్గిపోతుంది. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తే 6.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.
Go Back to Shorts
EPF
private employees
pension
pension commutation

More Telugu News