టీమిండియా టార్గెట్ 204 రన్స్... ఆదిలోనే రోహిత్ శర్మ అవుట్
- మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు
- అర్ధసెంచరీలు సాధించిన మున్రో, విలియమ్సన్, టేలర్
ఇక 204 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 31 పరుగులు. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ ఆడుతున్నారు.