గతంలో తన తల్లి మేనక చేసిన పాత్రలో కనిపించనున్న కీర్తి సురేశ్
- రజనీ - మేనక జంటగా గతంలో వచ్చిన 'నేత్రిక్కన్'
- రీమేక్ కి సన్నాహాలు మొదలెట్టిన ధనుశ్
- మరోసారి ధనుశ్ జోడీ కడుతున్న కీర్తి సురేశ్
ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ధనుశ్ కి రావడం .. ఆయన రంగంలోకి దిగిపోవడం జరిగిపోయాయి. గతంలో రజనీ చేసిన పాత్రను ధనుశ్ పోషించనుండగా, మేనక ధరించిన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ సినిమాను ధనుశ్ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలియజేయనున్నారు. ధనుశ్ - కీర్తి సురేశ్ ఇంతకుముందు 'రైల్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.