మీ ఆదేశాలను అమలు చేస్తాం అధ్యక్షా: జగన్
- టీడీపీ నేతలు బినామీల పేర్లతో భూములు కొన్నారన్న బుగ్గన
- విచారణ జరిపించాలని సీఎంను కోరిన స్పీకర్
- స్పీకర్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన జగన్
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, ఇవి నిజాలైనా, ఆరోపణలైనా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ అంశంపై సమగ్రమైన విచారణ జరిపి, దోషులెవరో ప్రజలకు తెలపాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. వెంటనే జగన్ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ ది అత్యున్నతమైన స్థానమని... ఆ స్థానం నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని... ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తామని చెప్పారు.