హోంమంత్రి ఇంటి ముందు అమరావతి జేఏసీ సభ్యుల బైఠాయింపు
- రాజధానిగా కొనసాగించాలని డిమాండ్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఆలపాటి రాజా తదితరుల అరెస్టు
మాజీ మంత్రి ఆలపాటి రాజా, డేగ ప్రభాకర్, నజీర్, గోళ్ల ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు సుచరిత ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. కాసేపటికి పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్టుచేసి నల్లపాడు స్టేషన్కు తరలించారు.