స్టార్ హీరోల నుంచి అదే నేర్చుకున్నాను: చమ్మక్ చంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టార్ హీరోల నుంచి అదే నేర్చుకున్నాను: చమ్మక్ చంద్ర

  • 'అ ఆ'లో మంచి పాత్ర చేశాను
  • ఆ హీరోలు స్టార్ డమ్ ను పక్కన పెట్టేస్తారు 
  • నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందన్న చమ్మక్ చంద్ర
బుల్లితెర నుంచి వెండితెరకి ఎదిగిన కమెడియన్ గా చమ్మక్ చంద్ర కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో 'అ ఆ' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'జబర్దస్త్'ను చూసే త్రివిక్రమ్ గారు నాకు ఆ పాత్రను ఇచ్చారు. ఆ సినిమా నుంచి నాకు ఆయన ఛాన్స్ ఇస్తూనే వున్నారు.

ఎన్టీఆర్ గారితో 'అరవింద సమేత' .. కల్యాణ్ రామ్ గారితో '118' చేశాను. ఎంతో పెద్ద ఫ్యామిలీ నేపథ్యం ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ ఎంతో ప్రేమగా పలకరిస్తారు, ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు. మహేశ్ బాబుగారితో .. అల్లు అర్జున్ గారితోను చేశాను. ప్రభాస్ గారితో .. చరణ్ గారితో చేయలేదుగానీ చాలా దగ్గరగా చూశాను. వాళ్లంతా కెరియర్ పరంగా ఎంతో ఎదిగినప్పటికీ ఒదిగివుండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతటివాళ్లే అలా వుంటున్నప్పుడు నా లాంటివారు ఇంకెంతగా ఒదిగి ఉండాలనేది నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.
Chammak Chandra

More Telugu News