అందరూ కలిసి వైసీపీ ప్రభుత్వంపై కుట్ర పన్నారు: మల్లాది విష్ణు
- చంద్రబాబు సూచనతోనే పవన్ ఢిల్లీకి వెళ్లారు
- 2019లో జనసేనను ప్రజలు తిరస్కరించారు
- బీజేపీ, జనసేన పొత్తుతో వైసీపీకి నష్టం లేదు
2014లోనే బీజేపీ, జనసేన పొత్తు ఉందని మల్లాది విష్ణు అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వంపై కుట్ర పన్నాయని మండిపడ్డారు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ గతంలో బీజేపీని పవన్ కల్యాణ్ విమర్శించారని... ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపారని విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.