మహిళలను కించపరిచేలా మాట్లాడిన వాసిరెడ్డి పద్మ క్షమాపణలు చెప్పాలి: టీడీపీ నేత అనిత డిమాండ్
- రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించాల్సిన అవసరమేంటి?
- మహిళలను మగ పోలీసులు అరెస్టు చేయడం తగదు
- మహిళలపై దాడులు చేయమని హోం మంత్రి చెప్పారా?
శాంతియుతంగా నిరసనకు దిగిన మహిళలను మగ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళలపై దాడులు చేయమని పోలీసులకు హోం మంత్రి చెప్పారా? అంటూ మండిపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వాసిరెడ్డి పద్మ మాట్లాడటం సబబు కాదని, మహిళలకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.