టెంటు పీకినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు: నారా లోకేశ్
- వేలాది మంది పోలీసులతో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరు
- ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుంది
- రైతులను ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదు
జగన్ నిరంకుశ పాలనకు రాజధానిలో ఉన్న పరిస్థితులే కారణమని చెప్పారు. మీరు ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుందని అన్నారు. రైతులను ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారని తెలిపారు. గ్రామాల్లోని గుళ్లకు కూడా తాళం వేసే పరిస్థితి వచ్చిందంటే... రాష్ట్రంలో ఎంత ఘోరమైన పాలన కొనసాగుతోందో అర్థమవుతోందని అన్నారు.