లంకను గెలిచిన టీమిండియా... సిరీస్ మనదే!
- మూడో టీ20లో భారత్ జయభేరి
- పుణే పోరులో 78 పరుగుల తేడాతో లంక ఓటమి
- 2-0 తో సిరీస్ టీమిండియా కైవసం
భారత బౌలర్లలో నవదీప్ సైనీకి 3 వికెట్లు దక్కగా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక భారత్ తన తదుపరి సిరీస్ ను కూడా సొంతగడ్డపైనే జనవరి 14 నుంచి ఆడనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్ లో ఆడనున్నాయి.