జేఏసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. భారీగా మోహరించిన పోలీసులు
- విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం
- బెంజ్ సర్కిల్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు
- సమావేశానంతరం మచిలీపట్నంకు ర్యాలీ
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. కుంటి సాకులతో బస్సు యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. బస్సు యాత్రను అడ్డుకుంటే ఫూల్స్ గా మిగిలిపోతారని చెప్పారు. మచిలీపట్నంకు వెళ్లే ర్యాలీని అడ్డుకుంటే ప్రభుత్వంతో తేల్చుకుంటామని హెచ్చరించారు.