ఓ బాలిక కడగండ్లు విని కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సినీ హీరో సూర్య
- సామాజిక సేవ చేస్తున్న తమిళ హీరో
- అగరం ఫౌండేషన్ తో ఆపన్నులకు చేయూత
- గాయత్రి అనే బాలికకు తోడ్పాటు అందించిన సూర్య
ఈ కార్యక్రమంలో గాయత్రి మాట్లాడుతూ, ఓ చిన్న పల్లెటూర్లో పుట్టిన తాను ప్రస్తుతం ఇంగ్లీష్ శిక్షకురాలిగా పనిచేస్తున్నానని, రోజు కూలీ కడుపున పుట్టిన తాను ఎన్నో కష్టాలు పడి కాలేజ్ విద్య పూర్తి చేయగలిగానని గాయత్రి వెల్లడించింది. అందుకు కారణం అగరం ఫౌండేషన్ అని, ఎక్కడో అనామకురాలిగా ఉన్న తాను ఎన్నో అడ్డంకులను అధిగమించానని, ఈ ప్రస్థానంలో అగరం ఫౌండేషన్ తోడ్పాటు మరువలేనని తెలిపింది. ఆమె దయనీయ గాథను విన్న సూర్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కన్నీళ్లు పెడుతూ, లేచి వెళ్లి గాయత్రిని వాత్సల్యంతో దగ్గరికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.