ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటికి రాలేదు?: రోజా
- నారా భువనేశ్వరిపై రోజా ఫైర్
- చంద్రబాబు చేతిలో రాజకీయ పావుగా మారారంటూ విమర్శలు
- రెండు గాజులు ఇస్తే ఎవరూ నమ్మరని వ్యాఖ్యలు
తోడబుట్టిన పురందేశ్వరి, హరికృష్ణలను పార్టీ నుంచి గెంటేసినంత పనిచేసినా భువనేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో స్కూలు పిల్లలు హుండీలు ఏర్పాటు చేస్తే భువనేశ్వరి కానీ, ఆమె కోడలు కానీ ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదని రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ రెండు గాజలు ఇస్తే ఎలా నమ్మాలని రైతులు అడుగుతున్నారని రోజా తెలిపారు.