నారా భువనేశ్వరిపై విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు
- ఆమె ప్రేమ రైతులపైనా లేక భూములపైనా అంటూ విమర్శలు
- ఇప్పుడెందుకు ప్రేమ కలిగిందని అడిగిన అంబటి
- భువనేశ్వరిని చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని వ్యాఖ్యలు
గత ప్రభుత్వ హయాంలో రైతులు చనిపోతే భువనేశ్వరికి జాలి కలగలేదని ఆరోపించారు. పుష్కరాల్లో 30 మంది చనిపోయినా ఆమెకు జాలి కలగలేదని, రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఆమెకు బాధ లేదని విమర్శించారు. ఇప్పుడు భువనేశ్వరి తన చేతి గాజులు ఇస్తుంటే తమకు జాలి కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా రాజధాని భూములపై వైసీపీ కార్యాలయంలో వీడియో ప్రదర్శించారు.