'జాన్' యాక్షన్ హీరో కాదు .. రొమాంటిక్ హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జాన్' యాక్షన్ హీరో కాదు .. రొమాంటిక్ హీరో!

  • ప్రభాస్ తదుపరి సినిమాగా 'జాన్'
  • లవ్ అండ్ ఎమోషన్ ప్రధానంగా సాగే కథ 
  • హైలైట్ గా నిలవనున్న ప్రభాస్ .. పూజా హెగ్డే రొమాన్స్
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'జాన్' సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది.  'జాన్' అనే టైటిల్ ను బట్టి చూస్తే ఈ సినిమాలోనూ యాక్షన్ సీన్లకి కొదవుండదని అభిమానులు అనుకోవడం సహజం.

కానీ, ఈ సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే వుంటుందట. కథ అనూహ్యమైన మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే ఈ యాక్షన్ సీన్ వస్తుందని అంటున్నారు. కథ మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని చెబుతున్నారు. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా విదేశీ నేపథ్యంలో సాగే ప్రేమకథగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ .. పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
Prabhas
Pooja Hegde

More Telugu News