6 రోజుల్లోనే వసూళ్లతో అదరగొట్టేసిన 'ప్రతిరోజూ పండగే'
- ఈ నెల 20న వచ్చిన 'ప్రతిరోజూ పండగే'
- విడుదలైన ప్రతి చోటా విజయవిహారం
- నైజామ్ లో అత్యధిక వసూళ్లు
ఈ సినిమా విడుదలైన ఈ 6 రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా 33.80 కోట్ల గ్రాస్ ను .. 18.43 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 6 రోజుల్లో 6.52 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయితేజ్ కెరియర్లో ఇక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. బలమైన కథాకథనాలు .. ఆకట్టుకునే పాటలు .. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు .. మనసును తాకే మాటలు ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.