ఒక్క క్లిక్కుతో 85,000 'నేతన్న'ల ఖాతాల్లో డబ్బులు వేసిన జగన్.. తనకు వచ్చిన మెసేజ్ చూపి ఉబ్బితబ్బిబ్బయిన వ్యక్తి!

21-12-2019 Sat 13:42 | Andhra
  • ధర్మవరంలోనే అక్షరాలా 10,700 కుటుంబాలకు లబ్ధి అన్న జగన్
  • అనంతపురం జిల్లాలో 27,000 మందికి మేలు
  • ల్యాప్ టాప్ లో జగన్ బటన్ క్లిక్ చేయగానే లబ్ధిదారులకు మెసేజ్ లు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభించిన రెండు గంటలకే ఆయన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నారు. ఒకే ఒక్క క్లిక్కుతో వారి ఖాతాల్లో డబ్బులు వేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 'చేనేత కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ బటన్ నొక్కుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఈ ధర్మవరంలోనే అక్షరాలా 10,700 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ జిల్లాలోనే ఈ అనంతపురం జిల్లాలో అక్షరాలా 27,000 మందికి మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను' అని తెలిపారు.

ల్యాప్ టాప్ లో జగన్ బటన్ క్లిక్ చేయగానే లబ్ధిదారులకు మెసేజ్ లు వచ్చాయి. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఓ లబ్ధిదారుడు తనకు వచ్చిన మెసేజ్ చూపెడుతూ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. మరి కొద్ది సమయంలో మీ ఖాతాలో రూ.24,000 జమ అవుతుందని అందులో ఉంది.  

JaganAndhra PradeshYSRCP

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more