శిరీష్ కోసం రంగంలోకి దిగిన చిరంజీవి
- హిట్ కోసం అల్లు శిరీష్ పాట్లు
- ఒక కథను ఓకే చేసిన చిరంజీవి
- దర్శకుడిగా రాకేశ్ శశి
అలాగే శిరీష్ కెరియర్ కి సంబంధించిన విషయంపై కూడా చిరంజీవి శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. అతని కోసం కొత్తగా ఆయన ఒక కథ విన్నారట. గతంలో కల్యాణ్ దేవ్ హీరోగా చేసిన 'విజేత' సినిమాకి దర్శకత్వం వహించిన రాకేశ్ శశి వినిపించిన ఒక కథ చిరంజీవికి బాగా నచ్చిందట. 'విజేత' పెద్దగా ఆడనప్పటికీ ఆ దర్శకుడు వినిపించిన కథకి చిరంజీవి ఓకే చెప్పడం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.