ఛేదనలో మూడు వికెట్లు కోల్పోయిన విండీస్.. హోప్ ఆశావహ పోరాటం!
- వైజాగ్ వన్డేలో టీమిండియా భారీ స్కోరు
- విండీస్ టార్గెట్ 388 పరుగులు
- బరిలో హోప్, పూరన్
ఓపెనర్ ఎవిన్ లూయిస్ 30 పరుగులకు అవుట్ కాగా, స్టార్ బ్యాట్స్ మన్ హెట్మెయర్ 4 పరుగులతో నిరాశపరిచాడు. రోస్టన్ చేజ్ (4) సైతం స్వల్పస్కోరుకు వెనుదిరగడంతో విండీస్ 86 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నికోలాస్ పూరన్ జతగా హోప్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో విండీస్ స్కోరు 100 మార్కు దాటింది. ప్రస్తుతం హోప్ 62, పూరన్ 29 పరుగులతో ఆడుతున్నారు. విండీస్ విజయానికి 26 ఓవర్లలో 253 పరుగులు చేయాలి.