'నేను సావర్కర్ ను' అని రాసి ఉన్న కాషాయ రంగు టోపీలను ధరించి అసెంబ్లీకి వచ్చిన మహారాష్ట్ర బీజేపీ నేతలు
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిరసన
- 'నా పేరు రాహుల్ సావర్కర్ కాదు' అని రాహుల్ వ్యాఖ్య
- మండిపడుతోన్న బీజేపీ నేతలు
ఈ క్రమంలో ఈ రోజు మహారాష్ట్ర బీజేపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇతర బీజేపీ నేతలు 'నేను సావర్కర్ ను' అని రాసి ఉన్న టోపీలను ధరించి వచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. కాషాయ రంగు టోపీలపై తెల్లటి అక్షరాలతో 'నేను సావర్కర్ ను' అని రాసి ఉంది.