విమర్శకుల నోళ్లు మూయించే ఇన్నింగ్స్ ఆడిన పంత్
- చెన్నైలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే
- 69 బంతుల్లో 71 పరుగులు చేసిన పంత్
- ఇటీవల విమర్శల దాడికి గురవుతున్న పంత్
ఇటీవల కాలంలో ఫామ్ లో లేక, పరుగులు రాక తీవ్రస్థాయిలో విమర్శలకు గురవుతున్న ఈ ఢిల్లీ యువ ఆటగాడు 69 బంతుల్లో 71 పరుగులు చేశాడు. పంత్ స్కోరులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడిన పంత్ విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్ లో పొలార్డ్ విసిరిన బంతితో పంత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ప్రస్తుతం భారత్ స్కోరు 43 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు. అయ్యర్ 70 పరుగులు చేసి వెనుదిరిగాడు. కేదార్ జాదవ్ 20, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు.