'వెంకీమామ'లో మెరవనున్న సమంత
- కేఎస్ రవీంద్ర దర్శకుడిగా 'వెంకీమామ'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- ఈ నెల 13వ తేదీన విడుదల
ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట. అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా వుంచారట. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ వార్తను బయటికి వదిలినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.