భారత పరిశోధకుల ఘనత.. పురుషులకు 'కుటుంబ నియంత్రణ' ఇంజెక్షన్ రెడీ
- ఇప్పటివరకు పురుషులకు ఇందుకోసం వేసెక్టమీ ఆపరేషన్
- ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్
- 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట
- ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవంటోన్న పరిశోధకులు
రివర్సిబుల్ ఇన్ హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్ఐఎస్యూజీ) అని ఈ ఇంజెక్షన్ కు పేరు పెట్టారు. స్టైరీన్ మేలియక్ ఆన్ హైడ్రైడ్ అనే పదార్థంతో రూపొందించిన ఈ ఇంజెక్షన్ తో 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట వేయొచ్చు. ఈ ఇంజెక్షన్ విజయాల రేటు 97.3 శాతంగా ఉందని, అంతేగాక, దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంజెక్షన్ ను విజయవంతంగా అభివృద్ధి చేసిన ఘనత ఇప్పటికీ అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకూ దక్కలేదు.