రేపు బ్లాక్ డే నేపథ్యంలో ఉప్పల్ మ్యాచ్ కు భారీ బందోబస్తు
- రేపు హైదరాబాదులో భారత్-వెస్టిండీస్ తొలి టి20
- డిసెంబరు 6న నగరంలో బ్లాక్ డే!
- మ్యాచ్ ను అడ్డుకుంటే కఠినచర్యలు తప్పవన్న సీపీ
మ్యాచ్ కోసం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని, బ్లాక్ డే సందర్భంగా ఎవరైనా మ్యాచ్ ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉప్పల్ మ్యాచ్ కోసం 1800 మంది పోలీసులను భద్రతా విధుల కోసం రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. త్రివర్ణ పతాకం తప్ప మరే ఇతర జెండాలు స్టేడియంలోకి అనుమతించబోమని, బ్యాగులు, లైటర్లు,సిగరెట్లు, ల్యాప్ టాప్ లు, ఆహార వస్తువులు, నాణేలు, పెన్నులు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, హెల్మెట్లు స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం అని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.