హిందూమతానికి బ్రాండ్ అంబాసిడర్లలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారు!: కొడాలి నాని
- చంద్రబాబు ఇంటి పక్కన మతమార్పిడి జరిగితే జగన్ పై విమర్శలా?
- కులాలు, మతాలపై రాజకీయాలు చేస్తున్నారు
- టీడీపీ, జనసేనను బీజేపీలో విలీనం చేయాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు
రాష్ట్రంలో కులాలు, మతాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీలో విలీనం చేయాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదంటూ సెటైర్లు విసిరారు. హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట్లాడుతున్నారని, తమ పార్టీపై కుయుక్తులు పన్నుతున్నారని విరుచుకుపడ్డారు.