మహారాష్ట్రకు ద్రోహం చేశారు: ఫడ్నవీస్ పై శివసేన నేత సంజయ్ రౌత్ ఆగ్రహం
- 80 గంటలు ముఖ్యమంత్రిగా ఉన్నారు
- కేంద్రానికి దేవేంద్ర ఫడ్నవీస్ రూ.40,000 కోట్లు బదిలీచేశారు
- ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చెప్పారు
కాగా, తాజాగా అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ... మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమయ్యాయని తమకు తెలుసని, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.40 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని, వీటిని కాపాడాలన్నదే ఫడ్నవీస్ ఉద్దేశమని అన్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, ఆ నిధులను తిరిగి కేంద్రానికి బదలాయించారని వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది.