Gudavalli Rajkumar: 'పునాదిరాళ్లు' దర్శకుడి పట్ల మానవత్వం చూపిన మరికొంత మంది సినీ ప్రముఖులు!

  • చిరంజీవి తొలిచిత్రం 'పునాదిరాళ్లు' దర్శకుడు రాజ్ కుమార్
  • తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు
  • సాయం చేసిన పలువురు
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం 'పునాదిరాళ్లు' అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్ కుమార్, చిరంజీవి భవిష్యత్ కు తొలి మెట్టును వేశారు. ఇప్పుడాయన తీవ్ర అనారోగ్యంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో పలువురు సినీ ప్రముఖులు స్పందించి, ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌, గూడపాటికి రూ. 50 వేలు సాయం అందించారు. మరో దర్శకుడు మెహర్‌ రమేష్‌ రూ. 10 వేలు, కాశీ విశ్వనాథ్‌ రూ. 5 వేలు సాయం చేయగా, ప్రసాద్స్‌ క్రియేటివ్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌ నర్‌ సురేష్‌ రెడ్డి రూ. 41 వేలు, నటుడు కాదంబరి కిరణ్‌ కుమార్‌ రూ. 25 వేలు అందించారు.
Gudavalli Rajkumar
Health
Chiranjeevi
Puri Jagannath

More Telugu News