ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం స్పందించకపోతే.. పెద్దఎత్తున కార్యాచరణకు దిగుతాం: కోదండరామ్
- ఆర్టీసీ కార్మికుల విషయమై ప్రభుత్వం స్పందించాలి
- ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలి
- సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నా
ఆర్టీసీ కార్మికుల విషయమై స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకపోతే రాజకీయపార్టీల నాయకులుగా తాము ఏమి చేయాలో, కార్మికులుగా వాళ్లు ఏం చేయాలో ఆలోచించుకుంటామని, కలిసి మాట్లాడుకుంటామని, జేఏసీతో చర్చిస్తామని, పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకోవాల్సిన అవశ్యకత వుందని చెప్పారు. ఇదంతా జరగకుండా వుండాలంటే ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నామన్నారు.