బీజేపీలో చేరిన 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ నేతలు
- కర్ణాటక ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
- అనర్హత వేటు ఎత్తేస్తూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు
- యడియూరప్ప ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నేతలు
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆధ్వర్యంలో వారు ఈ రోజు బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, ఈ కార్యక్రమానికి ముందు యడియూరప్ప.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తమ పార్టీ నేతలతో కలిసి ఆయనకు నివాళులర్పించారు.