నా సినిమాలో కథానాయిక పాత్రకు ముందుగా రష్మీనే అడిగాం!: 'సుడిగాలి' సుధీర్
- కథను బట్టే టైటిల్ పెట్టారు
- రష్మీ డేట్స్ సర్దుబాటు కాలేదు
- డిసెంబర్ మొదటివారంలో వస్తుందన్న సుధీర్
ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ .."కథను బట్టే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టాము. కామెడీతో పాటు అన్ని రకాల అంశాలు ఇందులో వుంటాయి. ఈ సినిమాలో నా జోడీగా ధన్యా బాలకృష్ణ నటించింది. ముందుగా ఈ పాత్ర కోసం దర్శక నిర్మాతలు రష్మినే సంప్రదించారు. కానీ అప్పటికే ఆమె వేరే సినిమాలు ఒప్పుకుని ఉండటం వలన కుదరలేదు. ఈ సినిమాలో నేను రజనీ స్టైల్ ను .. పవన్ స్టైల్ ను అనుకరించిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా విడుదల కానుంది'అని చెప్పాడు.