మిసెస్ ఇండియా తెలంగాణ-2019 టైటిల్ గెలిచిన లేడీ డాక్టర్
- లండన్ లో వైద్యురాలిగా శోభాదేవికి గుర్తింపు
- స్వదేశంపై ప్రేమతో భారత్ వచ్చేసిన వైద్యురాలు
- ఫ్యాషన్ రంగంపై మక్కువ
అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చిన శోభాదేవి హైదరాబాద్ లోని లైఫ్ స్పాన్ ఆసుపత్రిలో డయాబెటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు ఏకంగా టైటిల్ ఎగరేసుకెళ్లారు. ఇంతటి ఘనత సాధించిన శోభాదేవి వయసు 63 సంవత్సరాలంటే ఎవరూ నమ్మలేరు.