మహారాష్ట్రలో బీజేపీ సర్కారు వద్దే వద్దు: కాంగ్రెస్ ఎమ్మెల్యే నాందేవ్‌రావు

  • ఫడ్నవిస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మంది రైతులు ఆత్మహత్య
  • బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటాం
  • శివసేన నుంచి ప్రతిపాదన వస్తే అధిష్ఠానం చూసుకుంటుంది
మహారాష్ట్రలో బీజేపీ సర్కారు వద్దే వద్దని కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యే విజయ్ నాందేవ్‌రావు అన్నారు. ఫడ్నవిస్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో 16 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కాకుండా తాము అడ్డుకుంటామని అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై శివసేన నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని నాందేవ్ అన్నారు. వస్తే కనుక అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Go Back to Shorts
Maharashtra
BJP
ncp
shivsena
Nandev Rao

More Telugu News