అద్దెకు ఐఫోన్లు... ఆపిల్ సంస్థ సరికొత్త ఆఫర్!

  • నెలవారీ రుసుముతో అద్దెకు ఐఫోన్లు
  • కొత్త మోడల్ వస్తే పాత్ మోడల్ వాపసు ఇచ్చే సౌకర్యం
  • ఆపిల్ సరికొత్త ప్రణాళిక!
యువతలో ఐఫోన్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఐఫోన్ ఖరీదు ఎక్కువ కావడంతో అధిక ఆదాయ వర్గాలకు చెందిన వారే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సరళిని గమనించిన ఆపిల్ సంస్థ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇకమీదట ఐఫోన్లు అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. నెలకు కొంత మొత్తం చెల్లించి ఐఫోన్ ను వాడుకోవచ్చు. కంపెనీ నుంచి కొత్త మోడల్ వస్తే పాత్ ఫోన్ వెనక్కి ఇచ్చేసి కొత్త దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఐఫోన్ ను అద్దెకు తీసుకున్నవాళ్లు ఐ ట్యూన్స్, ఐ క్లౌడ్ వంటి సేవలకు కూడా అదనంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఆపిల్ సంస్థ నుంచి ఓ ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Iphone
Apple
Rent

More Telugu News