ఎమ్మెల్యే ధర్మారెడ్డికి చేదు అనుభవం
Add ap7am to your home Screen

ఎమ్మెల్యే ధర్మారెడ్డికి చేదు అనుభవం

  • హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్‌ రవీందర్‌ గుండెపోటుతో మృతి
  • నివాళులర్పించేందుకు వచ్చిన ధర్మారెడ్డి
  • ఆయనకు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో తమ భవిష్యత్తుపై కార్మికులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్‌ రవీందర్‌ నాలుగు రోజుల కింద గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరాడు. ఆయన ఈ రోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృత దేహాన్ని వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరుకు తరలించారు. రవీందర్ ఇంటికి కార్మికులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు.

దీంతో ఆత్మకూరులో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కండక్టర్ రవీందర్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా కార్మికులంతా నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Telangana
rtc

More Telugu News