పూజారితో కొరడా దెబ్బలు కొట్టించుకున్న సీఎం భూపేశ్ భగేల్!

  • గోవర్ధన పూజ సందర్భంగా ఓ ఆలయాన్ని సందర్శించిన ఛత్తీస్ గఢ్ సీఎం
  • అమ్మవారి ఎదుట కొరడా దెబ్బలు తింటే శుభం చేకూరుతుందని నమ్మకం
  • చేతిని చాచి కొరడాతో కొట్టించుకున్న భూపేశ్
గోవర్ధన పూజ సందర్భంగా ఓ ఆలయాన్ని సందర్శించిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్.. ఆలయ సంప్రదాయం ప్రకారం అక్కడి పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. ఇక్కడ అమ్మవారి ఎదుట ఇలా కొరడా దెబ్బలు తింటే శుభం చేకూరుతుందని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన చేతిని చాపి, కొరడా దెబ్బలు తిని వెళ్లాలని భావించారు.

ముఖ్యమంత్రిని కూడా సామాన్య భక్తుడిగానే భావించిన పూజారి ఆరు కొరడా దెబ్బలు కొట్టారు. అనంతరం భూపేశ్ భగేల్.. తన చేతిని తీసేశారు. కొరడా దెబ్బలు తింటోన్న సమయంలో భూపేశ్ నవ్వుతూ కనపడ్డారు. అనంతరం పూజారి సీఎంకు నమస్కరించారు. పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకున్న సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Go Back to Shorts
Chhattisgarh
Bhupesh Baghel

More Telugu News