ఈ ఇద్దరు ఎవరో చెబితే బహుమతి ఇస్తా: వర్మ ప్రకటన

  • షూటింగ్ దశలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'
  • ట్విట్టర్ లో వర్మ ప్రకటన
  • దీపావళికి ట్రైలర్ రిలీజ్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి తాజాగా వస్తున్న చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేదిగా భావిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, తన సినిమాకు ప్రాచుర్యం కల్పించేందుకు వర్మ ఎలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తుంటారో తెలిసిందే. తాజాగా, ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేసి ఇందులో ఉన్న ఇద్దరు క్యారక్టర్లు ఎవరో చెబితే బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు, దీపావళి రోజున 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
RGV
KRKR
Tollywood

More Telugu News