మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ... హర్యానాలో పోటాపోటీ!
- ఐదేళ్ల క్రితం ఫలితాల రిపీట్
- మహారాష్ట్రలో 100కు పైగా స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యం
- హర్యానాలో 26 చోట్ల ముందంజ
ఇక, 288 స్థానాలున్న మహారాష్ట్రలో 174 చోట్ల తొలి రౌండ్ కౌంటింగ్ ముగియగా, బీజేపీ, శివసేన కూటమి 108 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి 48 స్థానాల్లో ఇతరులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక హర్యానా విషయానికి వస్తే, 90 స్థానాలుండగా, 50 చోట్ల తొలి రౌండ్ పూర్తయింది. బీజేపీ 26 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, ఐఎస్ఎల్డీ కూటమి ఒక్క చోట, జేజేపీ 2 చోట్ల, ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.