సవతి ప్రేమ నటిస్తే విశాఖ ప్రజలు నమ్మరు: చంద్రబాబుపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ విమర్శలు
- చంద్రబాబుపై వైసీపీ నేత ఫైర్
- విశాఖ నగరానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్న అమర్ నాథ్
- వైఎస్సార్ హయాంలో వైజాగ్ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యలు
వైసీపీ శాసనసభ్యుడు గుడివాడ అమర్ నాథ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు విశాఖపట్నం నగరానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. విశాఖ ఆస్తులను ఎవరి పరం చేద్దామా అన్న ఆలోచనే తప్ప, నగరానికి ఆయన ఎలాంటి మేలు చేయలేదని స్పష్టం చేశారు.
విశాఖ బాగుపడిందంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అభివృద్ధి చెందుతోందని వివరించారు. చంద్రబాబు ఇప్పుడొచ్చి సవతి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మబోరని విమర్శించారు. ఉక్కు కర్మాగారాన్ని ఎవరికి ఇచ్చేద్దాం, బీహెచ్ పీవీని ఎప్పుడు ఎల్ అండ్ టీకి ఇచ్చేద్దాం, విశాఖ కొండలను ఎప్పుడు గీతం సంస్థలకు కట్టబెడదాం అని తహతహలాడడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని అమర్ నాథ్ వ్యాఖ్యానించారు.