'ప్రతిరోజూ పండగే' నుంచి ఆకట్టుకుంటోన్న ఫస్టులుక్ పోస్టర్
- మారుతి నుంచి 'ప్రతిరోజూ పండగే'
- తేజూ జోడీగా రాశి ఖన్నా
- కీలకమైన పాత్రలో సత్యరాజ్
సాయిధరమ్ తేజ్ జోడీగా రాశి ఖన్నా నటిస్తోన్న ఈ సినిమాలో, తేజుకి తాతయ్య పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర కీలకం కానుంది. తాజాగా తాతా మనవళ్లుగా తేజు - సత్యరాజ్ పాత్రలకి సంబంధించిన పోస్టర్ ను ఫస్టులుక్ గా వదిలారు. గ్రామీణ నేపథ్యంలో తాతా మనవళ్ల మధ్య అనురాగానికి అద్దం పడుతోన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మారుతి ఫస్టులుక్ తోనే మంచి మార్కులు కొట్టేశాడు.