యాదాద్రి ఆలయం స్తంభాలపై కేసీఆర్ బొమ్మలపై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్!
- ఈ విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా?
- ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
- వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఈ విషయం కేసీఆర్ కు తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా కేసీఆర్ తనను తాను భగవంతుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ స్తంభాలను వెంటనే తీసేయాలనీ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వీటిని తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.
ఏంతో ప్రాశస్త్యం ఉన్న యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో గుడి కడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరికావని హితవు పలికారు. ఈ విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.