యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- 'హుషారు'తో హిట్ కొట్టిన శ్రీహర్ష
- ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ
- వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి
ఈ నేపథ్యంలోనే మరో వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'హుషారు' దర్శకుడు శ్రీహర్ష కోనుగంటికి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడనేదే ఆ వార్త సారాంశం. 'హుషారు' చిన్న సినిమానే అయినా యూత్ కి బాగా కనెక్ట్ అయింది .. మంచి వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా శ్రీహర్షకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించగా, తనకి బాగా నచ్చేసిందనీ, చేసేద్దామని విజయ్ దేవరకొండ మాట ఇచ్చేశాడట. ఒక ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడనీ, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.