భారీ వరద... మరోసారి తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు!
- 10 గేట్ల ఎత్తివేత
- దిగువకు 7,500 క్యూసెక్కుల నీరు
- లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం
ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా దాదాపు 20 వేల క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాగా, పులిచింతల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగానే ప్రకాశం బ్యారేజ్ కి వరద పెరిగింది.